భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం. జనవరి.13.పయనించే సూర్యుడు. యూసఫ్
అయితే సమస్య రైతులకు కాదు ఇప్పుడు వ్యాపారస్తులకు ఇబ్బందిగా మారింది కొందరు గిరిజన ప్రాంతాల్లో వ్యాపారాలు గిరిజనేతరులు చేయకూడదనీ. మార్కెట్ యార్డ్ కు కరెంటు సౌకర్యం ఎట్లా కల్పించారంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాలను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టికి తీసుకువచ్చారు. ఆదివారం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలు అభివృద్ధినీ కూడా చూడాలని,1/70 చట్టాలను సాకుగా చూప వద్దని ,చట్టాల ను చట్టాలుగా చూడాలని అభివృద్ధిని కూడా చూడాలని చెప్పారు.
గిరిజనులు గిరిజనేతరులు అనే భావన రావద్దని అందరూ సమాజంలో కలిసి ఉండాల్సిందేనని, చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దని. నష్టపోయేది సబ్ మార్కెట్ లో పనిచేసే వందలాదిమంది కూలీలే అని ఆయన గుర్తు చేశారు అయితే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వ్యాపారస్తులు ముందే విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్తును పునరుద్ధరించాలని .
సబ్ మార్కెట్ ను పూర్తి స్థాయి మార్కెట్ గాత్వరలోనే అభివృద్ధి పరుస్తామని ప్రభుత్వం పది ఎకరాల స్థలాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలకు సైతం భద్రత కల్పిస్తామని వారి కి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.