
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి పెద్దమ్మతల్లికి శరన్నవరాత్రులలో భాగంగా మూడవరోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణ చేయడం జరిగింది. ఆశ్విజ శుద్ధ చవితి సందర్భంగా వేద పండితులచే హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు ప్రత్యేక పూలు పండ్లతో దేదీప్యమానంగా ఆలయ ప్రాంగణాన్ని అరటిపట్టలచే మామిడి ఆకులతో టెంకాయ పట్టలతో పచ్చదనం ఉట్టి పడేలా అలంకరించారు పెద్ద ఎత్తున వచ్చిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు జై పెద్దమ్మతల్లి జై జై పెద్దమ్మతల్లి అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం అంతా మారు మోగింది రాత్రివేళ రంగురంగుల విద్యుత్ తోరణాలు ఎల్ఈడి బలుపులతో ఆలయ ప్రాంగణమంతా కాంతులు వేద చల్లడం జరుగుతున్నది పండగ వాతావరణం ముందుగానే వచ్చిందా అనే విధంగా యాడికి పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతున్నది
