Sunday, April 20, 2025
HomeUncategorizedగాయపడ్డ గీతా కార్మికుల పరామార్శ..వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి.

గాయపడ్డ గీతా కార్మికుల పరామార్శ..వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి.

Listen to this article
  • మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్.. పయనించే సూర్యడు //ఫిబ్రవరి //17//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలో వీరగొని రాములు గౌడ్, గాజర్ల మల్లయ్య గౌడ్, అనే గీతా కార్మికులు ఇద్దరు వృత్తిరీత్యా తాటిచెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు కాగా వారిని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్,పరామర్శించారు.అనంతరం వీరస్వామిగౌడ్ మాట్లాడుతు… దాదాపు 2 సంవత్సరాలుగా తెలంగాణలో చాలా మంది గాయపడ్డారని కొందరు గాయపడి మంచానికే పరిమితం అయ్యారని కొందరు చనిపోయారని ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే ఎక్సగ్రేషియా విడుదల చేసి ఆదుకోవాలని వీరస్వామి గౌడ్ డిమాండ్ చేశారు.గత ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలు పట్ల అధికారపార్టీకి చిత్తశుద్ధిలేకుండా పోయిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సంక్షేమ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యమే చూపుతున్నదని దీంతో ప్రమాదకరమైన వృత్తి అని తెలిసినా బతుకుదెరువు కోసం తాటిచెట్లు ఎక్కి కుటుంబాల్ని పోషించుకుంటున్న వారి జీవనం రోజురోజుకూ ప్రశ్నార్థకమౌతుందని వీరస్వామి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో గీత కార్మికులకోసం సర్కార్‌ చేపట్టిన చర్యల్ని ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలుగుతుందని,ఎందుకంటే వృత్తిలో ప్రమాదాలను నివారించడానికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ కిట్టును తప్ప మిగతా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని జులై 14న అబ్డుల్లాపూర్‌మెట్‌లోని లష్కర్‌ గూడాలో గీత కార్మికులతో సభ నిర్వహించిన ముఖ్యమంత్రి కాటమయ్య రక్షణ కవచం విడుదల చేసి అనేక హామీలిచ్చారని,మాటలు తప్ప చేతలులేవని గారడి మాటలతో కాలం వెళ్ళదిస్తున్నారని, మాట్లాడారు.కాటమయ్య రక్షణ కవచాన్ని అందరు గీతా కార్మికులకు తక్షణం అందించి ప్రాణాలు కాపాడాలని వీరస్వామిగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ 8 నెలల కాలంలో పదివేల మందికి ఎలా వాడాలో ట్రైనింగ్‌ ఇప్పించి రక్షణ కవచాన్ని పంపిణీ చేశారు.ఇంకా పదివేల మందికి మంజూరు చేశారు.ఇది మంచి విషయమే కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే సభ్యత్వం కలిగిన వాళ్లు రెండు లక్షల 50 వేల మంది గీతకార్మికులు ఉన్నారు.సభ్యత్వం లేకుండా వృత్తి చేసేవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.కొన్ని గ్రామాలకు అసలు రక్షణ కవచాలు ఇంతవరకు అందలేదు.వచ్చిన గ్రామాలకు కూడా ఒకటి రెండు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి వారు రక్షణ కవచాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారన్నారు.అయితే ఈ మధ్య కాలం లోనే పందొమ్మిది మంది గీత కార్మికులు వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి పడి చనిపోయారు.ముందే రక్షణ కవచం ఇచ్చి ఉంటే బతికేవారు కదా,కుటుంబాలు కూడా రోడ్డున పడెవి కాదు కదా, అలాగే చాలామంది గాయపడ్డారని వీరస్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.రాష్టంలో కాగ్రెoస్ పార్టీ అధికారంలోకి వస్తే గీత వృత్తిలో ప్రమాదవశాత్తు చనిపోయినవారికి తీవ్రంగా గాయపడ్డ వారికి నెలరోజులలోపే ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని పరిహారాన్ని కూడా 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారని కాని హామి హామీగానే మిగిలిపోయిందని ఎక్సగ్రేషియా మాములుగా దెబ్బలు తలిగిన వారికి 10 వేలు కాకుండా 2 లక్షలు వరకు పెంచి ఇవ్వాలని వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.ఎక్సగ్రేషియా అందక బాధిత కుటుంబాలు కుటుంబ పోషణకు కూలీపనులు చేసుకుంటూ బతుకులీడు స్తున్నారని జులైలో జరిగిన సభలోనే ముఖ్యమంత్రి ఈ డబ్బులు ఇప్పుడే విడుదల చేస్తామని బాహాటంగా చెప్పారని కానీ 8 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని గీతకార్మికులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుoదన్నారు. అలాగే వృత్తిలో ప్రమాదాలు జరిగిన వారికి టాడి కార్పొరేషన్‌ నుండి ఇస్తున్న తక్షణ సహాయం చనిపోయిన వారికి దహనసంస్కారాల కోసం రూ.25వేలు గాయాలైనవారికి రూ.15వేలు బడ్జెట్‌ లేదనే పేరుతో నిలిపేశారని తక్షణమే బడ్జెట్ రిలీజ్ చేసి ఆదుకోవాలని కొత్తగా పథకాలు పెట్టకపోగా ఉన్న సాయాన్ని కూడా అర్థంతరంగా నిలిపివేశరని వీరస్వామి గౌడ్ విమర్శించారు.వెంటనే ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించాలని గౌడ గీతా కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ మర్రి మల్లేశం,గౌడసంఘము మండల ఉపాధ్యక్షులు జక్కే రవిగౌడ్, గ్రామ గౌడ సంఘము అద్యక్షులు కొండ వెంకట్రాజం, గౌడ్ మాజీ అద్యక్షులు గండు నరయ్య గౌడ్, బుర్ర కుమార్,గౌడ్ కొండ మొండెయ్య,గౌడ్ కొండ అర్జున్ గౌడ్,పెరుగు శ్రీనివాస్, బోయిని నర్సయ్య ,గ్రామ గీతా కార్మికులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments