
పయనించే సూర్యుడు మార్చి 7 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
గుండెపోటుతో మరణించిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్
శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ లో కట్టెల మండిలో గత కొన్ని సంవత్సరాలుగా కట్టెల మండి ఓనర్ శ్రీనివాస్ దగ్గర శ్రీకాకుళానికి చెందిన కార్మికుడు దుర్యోధన అక్కడ పని చేయడం జరుగుతుంది. కట్టెల మండిలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గుండెపోటు రావడంతో దుర్యోధన అనే కార్మికుడు మరణించడం జరిగింది.మరణించిన కార్మికుడు దుర్యోధన కుటుంబ సభ్యులకు ఎవరైతే న్యాయం చేస్తారో అని తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు, బి ఆర్ టి యు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ ను ఆశ్రయించారు.. వెంటనే స్పందించిన రవిసింగ్ మియాపూర్ కట్టెల మండి ఓనర్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి చనిపోయిన దుర్యోధన కుటుంబానికి ఏలాంటి ఉపాధి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ఎలాగైనా తగిన ఆర్థిక న్యాయం జరగాలని ఆ కుటుంబానికి, మూడు లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనిల్ సుదర్శన్ జగన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు