
పయనించే సూర్యుడు 01 ఆగస్టు ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ స్థానిక మండల కేంద్రంలో ఎస్టిఎఫ్ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రజతోత్సవాల సందర్భంగా పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని టియస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు రాఘవరావు ఎగురవేశారు.ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని, నూతన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని,సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగ,ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ మంజూరు చేయాలని, ఆదాయ పన్ను స్లాబు రేట్లు సవరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్.టి.ఎఫ్.ఐ మహాసభల పోస్టర్లను మండల ఉపాధ్యక్షులు జర్పుల పుల్లయ్య చేతుల మీద ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.రామ్ చంద్,మూడ్ పుల్లయ్య, ఉపాధ్యక్షులు శ్రీదేవి, జె.పుల్లయ్య,యుటిఎఫ్ నాయకులు వర్జీనియా, హతిరాం,సింగ్యా,సునీల్ వర్మ,గోపాల్,వీరయ్య, శంకర్రావు,ఎం. నాగేశ్వరరావు, నరసింహారావు,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
