
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 11 మామిడిపెల్లి లక్ష్మణ్
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రోజున ధనుర్మాసం సందర్భంగా కుడారై ఉత్సవం ను పండితులు జగన్మానాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి పాలతో చేసిన పాయసంను,నైవేద్యంగా 108 ఇత్తడి పాత్రలో నివేదించి భక్తులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునాథ్,ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి,అనుపురం చిన్న లింబాద్రిగౌడ్,కనపర్తి శ్రీనివాస్,నాయకులు సామల్ల వేణు,కొమ్మల ఆదిరెడ్డి, కొల్లూరి వేణు,రొట్టె శ్రీధర్,నల్ల గంగారెడ్డి,బోడుగం అంజిరెడ్డి, ఉత్కం సాయగౌడ్,సోమ అంజిరెడ్డి,నారాయణ గౌడ్, భూమేష్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.