
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన సందర్బంగా బంజారా హిల్స్ లోని బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో క్యాన్సర్ వ్యాధి బాధితులకు మరియు వారి రెండు వందల యాబై కుటుంబాలకు ఆహారం అందించడం జరిగింది.ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ ఆయురారోగ్య లతో అష్ట ఐశ్వర్య లతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పేర్కొన్నారు. ఇందులో పలువురు విద్యార్థి నాయకులు జోగు కిరణ్, కట్ట శ్రీనివాస్,వై. రాజు, ఏ. దుర్గ ప్రసాద్, మణికంఠ, కే. వెంకట్, బబ్లు, భరత్, లోకేష్, చందు, రవి తదితరులు పాల్గొన్నారు.