
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 24: టంగుటూరు మండలరిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం టంగుటూరు గ్రామంలోని పాకల రోడ్డు లోని న్యూలైఫ్ పరిశుద్ద ఆరాధన మందిర ప్రాంగణంలో న్యూలైఫ్ విద్యార్థుల ప్రార్థన సమావేశం న్యూలైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ వైద్య నిపుణులు సంహిత విద్యార్థులనుద్దేశించి వారిని ప్రోత్సహిస్తూ సందేశాన్నిచ్చారు.పేస్ కాలేజ్ లెక్టరర్ కావ్య అధ్యక్షత న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూలైఫ్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ సుదర్శన్ బాబు, దైవజనురాలు ఎస్తేరు రాణి,అమృత సుదర్శన్శామ్యేల్, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ శైలజవిద్యార్థిని విద్యార్థులు 600 మంది పాల్గొన్నారు.