
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 సంగారెడ్డి జిల్లా కంగిటి మండలనారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ఎమ్మార్పీఎస్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన తడ్కల్ క్లస్టర్ అధ్యక్షుడు లాల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆమె భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ నుండి విముక్తి కై భూస్వాములు దొరలపై ఎర్రజెండా చేత బుని తిరగబడ్డ విప్లవ కణికం వీర తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మలగా ప్రతి ఆడబిడ్డ ఐలమ్మ పోరాట స్ఫూర్తితో రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్కలుతెగువ ధైర్యం చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తడ్కల్ క్లస్టర్ కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల అంజి మాదిగ, ప్రధాన కార్యదర్శి చిలుక గంగారం మాదిగ, సహాయ కార్యదర్శి ఎర్రోళ్ల రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు సల్మాన్ మాదిగ, సాయిలు మాదిగ,రాజకుమార్ మాదిగ, ఘనపూర్ సాయిలు మాదిగ , చిలుక. రాములు మాదిగ, మోజేష్ మాదిగ, కిరణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.