
లబ్దిదారులకు అందచేసిన మండల గిర్దవారి మంజుల
పయనించే సూర్యుడు,ఆగస్టు 25, మహబూబ్ నగర్ జిల్లా రాజా పూర్ మండలం రిపోర్టర్ నరిగే శేఖర్ )రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామం లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న రాజాపూర్ మండల గిర్దవారి మంజుల హారులైన లబ్దిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు అందచేసారు.పాత రేషన్ కర్డులలో 19 మంది సభ్యులను చేర్చడం తో పాటు కొత్త రేషన్ కార్డులు 8 మంది సభ్యులకు అందచేసారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆర్ .రమేష్ రెడ్డి , తిరుపతి రెడ్డి, కే శేఖర్ రెడ్డి, కే. బాల లింగం ,ఎర్ర శివ కుమార్ ,పిట్టల శేఖర్ ,ఎరుకలి రాజు , ఎండీ రఫిక్ తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.