
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 7(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలో ఎంపీ.డీ.వో. వీర్రాజు అధ్యక్షతన ఎం.పీ.డీ.వో.మీటింగ్ హాల్ నందు జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి గారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే అసెంబ్లీలో చేనేత శాఖామంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి చేనేత కార్మికుల కష్టాలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నేను అందరికీ ఒకటే మాట ఇచ్చాను ధర్మవరం ఎలాగైతే చేనేత రంగంలో ముందుందో అలాగే మన యాడికి కి కూడా అలాంటి వైభవం తేవాలని ఒక చేనేత హబ్బుగా పేరు తేవాలని అన్నారు. అందరూ వ్యక్తిగత సమస్యలు నాతో చెబుతున్నారు తప్ప నేను కలిసిన వందమందిలో ఎవరో ఒకరు ఒక మీటింగ్ పెట్టుకొని చేనేత కార్మికుల సమస్యలు తీర్చాలని చెప్పారు. ఒక మీటింగ్ పెట్టుకుని ఏదైతే చేయగలుగుతామో అది కచ్చితంగా చేస్తాం అని శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి తెలిపారు. అనంతరం వృద్ధులైన చేనేత కార్మికులకు తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రతాపరెడ్డి, ఎంపీడీవో, వీర్రాజు, ఈ.ఓ.ఆర్.డి.శశికళ టి.డి.పి.మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, మాజీ ఎం.పీ.పీ. వేలూరి రంగయ్య, టౌన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, సింగిల్ విండో ప్రెసిడెంట్ చలమారెడ్డి, రవికుమార్ రెడ్డి, తిరంపురం నీలకంఠ, బొట్టు శేఖర్ మధురాజు, విశ్వనాథ్, గండికోట లక్ష్మణ్, సెల్ పాయింట్ చాంద్ బాషా, ఫైబర్ చందు, కరెంట్ రహంతుల్లా, తదితర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,చేనేత కార్మికులు పాల్గొన్నారు.
