
//పయనించే సూర్యుడు// జులై 2//మక్తల్
మీరు ఒక వైద్యుడిగా అందిస్తున్న సేవలు అమూల్యమైనవే కాదు, ఆధ్యాత్మికమైనవు కూడా. ప్రాణాలను కాపాడే మహత్తర బాధ్యతను ఎంతో నిబద్ధతతో నిర్వర్తిస్తూ, ప్రజల ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మీ నిస్వార్థతకు మా వందనాలు. ఒక వైద్యుడిగా మాత్రమే కాకుండా, ఒక నాయకుడిగా, సేవాసత్తా కలిగిన కార్యకర్తగా మీరు నిరంతరం ప్రజలతో మమేకమై సేవ చేయడాన్ని గమనించి, ఎంతో గర్వంగా భావిస్తున్నాం. మీ మక్తల్ నియోజకవర్గంలో, మీరు వైద్య సేవలతో పాటు, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళుతూ, జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తీరు నిజంగా ప్రతి యువతకు ప్రేరణ. మీరు పార్టీని నడిపించే తీరు, మక్తల్ లో పార్టీకి ఏర్పడుతున్న విశ్వాసం చూస్తే, మీరు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ఒక కీలకమైన నాయకుడిగా ఎదగబోతున్నారు అనే నమ్మకం నాకు బలంగా ఉంది. ఈ తరుణంలో నేను గట్టిగా నమ్మే విషయం ఒక్కటుంది “నేటి యువతే రేపటి తరానికి నాయకులు” ను సమర్థంగా నడిపించగలరు. పరిస్థితులను సాహసోపేతంగా ఎదుర్కొని ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకునే శక్తి యువతకే ఉంది. అందుకే, మీరు పార్టీ పరంగా మరింత ఉన్నత స్థాయిలో, ముఖ్యమైన పదవిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మక్తల్ నియోజకవర్గం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుంది — అది మీ వైద్య వృత్తిలో, పార్టీ దిశగా, రెండింట్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. మీరు చేస్తున్న కృషికి ఫలితాలు రావడం చూస్తే, మరింత విశ్వాసంతో ముందుకు సాగాలనే నమ్మకం కలుగుతుంది. ఈ డాక్టర్ డే సందర్భంగా మీ శ్రమకు అభినందనలతో పాటు, మీ ఎదుగుదలకు శుభాకాంక్షలతో పాటు,
మీ రాజకీయ జీవితంలో ఉన్నత స్థానం అందుకోవాలని తెలంగాణ జనసేన పార్టీ కార్యవర్గం మరియు అక్షయ్ రెడ్డి గారు ఆకాంక్షిస్తున్నారు
