
పయనించేసూర్యుడుఏప్రిల్:07: ములుగు జిల్లావాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి. ఎ.
ములుగు జిల్లా వాజేడు మండలంలోనిపేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ యోషిత గారి ఆధ్వర్యంలో గర్భవతులకు పరీక్షలు నిర్వహించడం జరిగినది
ఎండాకాలంలో గర్భవతులు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవేళ వడదెబ్బకు గురి అయితే ఉమ్మనీరు తగ్గుతుందని తెలియజేశారు
గర్భస్థ కాలంలో తీసుకోవలసిన సమతుల పోషకాహారం గురించి, ముఖ్యంగా ఎండాకాలం కూరగాయలు పండ్లు విరివిగా తినాలని తెలియజేశారు
ఆసుపత్రిలో సుఖప్రసవం కావడం కోసం వ్యాయామం, యోగ ప్రతిరోజు మధ్యాహ్నం ఒక అరగంట పాటు విశ్రాంతి తీసుకోవడం గురించి వివరించారు .
ప్రమాద భరిత లక్షణాలున్న గర్భవతులను అలాగే రక్తహీనత ఉన్న గర్భవతులను గుర్తించి వారికి రక్తహీనత నుంచి విముక్తి పొందడం కోసం రక్తహీనత కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో Heo వేణుగోపాలకృష్ణ PHN సంగీత గారు, నర్సింగ్ ఆఫీసర్ రమ గారు, అనూష గారు, ANM శకుంతల గారు,anm సుమలత గారు,LT అశ్విని గారు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
