
పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రా నికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించ డమే లక్ష్యంగా ఈ పర్యట నను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామిక వేత్తలు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడు లకు అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టోక్యో పర్యటనను గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ప్రారంభించను న్నారు. అనంతరం టోక్యో గవర్నర్‌ను మర్యాదపూర్వ కంగా కలుసుకోనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను బలపరచ డంలో కీలకంగా మారనుంది. తర్వాత, భారత ఎంబసీ ఆధ్వర్యంలో జరగనున్న పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇందులో టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈవోలతో వేర్వేరుగా భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చించనున్నా రు. ఆ తర్వాత, జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణలో నగరాభి వృద్ధి, రవాణా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేం దుకు మార్గాలు చర్చించను న్నారు.అంతేకాకుండా, టోక్యోలోని ప్రసిద్ధ సుమిదా నది తీర ప్రాంతంను సీఎం సందర్శించనున్నారు.ఈ సందర్శన ద్వారా నగర ప్రణాళికల్లో కొత్త ఆలోచన లకు ప్రేరణ లభించే అవకాశం ఉంది. ఈ పర్యటన తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల రాకకు దారి తీసేలా, రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారేలా ఉండబో తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.