
- ఎంతోమంది నిరుపేదలకు ఆసరా..
- నడవలేని వారికి వీల్ చైర్స్ వితరణ..
- నిజమైన నిరుపేదలకు కంటి ఆసుపత్రి కట్టించిన ఘనత.. ఐఏఎస్ నరహరి..
పయనించే సూర్యడు // మార్చ్ // 1 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హాసన్ పర్తి మండలం, చింతగట్టు గ్రామమైనటువంటి, నిరుపేదల కోసం నేను సైతం అంటూ, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి, ఐఏఎస్ నరహరి జన్మదిన సందర్బంగా, నిరుపేదల ఆశీర్వాదం..చింతగట్టు గ్రామంలో జన్మించిన ఐఏఎస్ నరహరి, బాల్యం చదువు పూర్తిగా బసంత్ నగర్ పెద్దపెల్లి జిల్లా, కేజీ నుండి ఎస్ఎస్సి వరికి, పూర్తి చేశాడు. ఇంటర్ నిమ్మకుర్తి , కృష్ణా డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ సొంత గ్రామం అయినటువంటి, ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పూర్తి చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నరహరి, చదువు పై ఉన్న ప్రేమతో ఫస్ట్ బ్యాంక్ రాగా , హైదరాబాదులోని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం, ఫ్రీ సీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా బీటెక్, పూర్తి చేశారు. ఆల్ ఇండియా 74 ర్యాంక్ సాధించాడు. 2001లో ఐఏఎస్ ఆఫీసర్ గా మధ్యప్రదేశ్ క్యాడర్లో, విధులు నిర్వహిస్తూ.. ఇప్పటికీ 28 సంవత్సరాలుగా, తనకంటూ ఒక గుర్తింపును పొందారు. ఈ తరుణంలో నిజమైన నిరుపేదలు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న కుటుంబీకులను చూసి, మనసు చెల్లించిపోయి, పేదవారికి ఏదోరకంగా సహాయం చేయాలి అని నిర్ణయించుకుని, ఆలయ ఫౌండేషన్ , నిర్మించారు.నిజమైన నిరుపేదలకు ఆలయ ఫౌండేషన్ ద్వారా, తన వంతు సహాయం చేసుకుంటూ, నడవలేని పరిస్థితిలో ఉన్న, పెద్దలకు, ( వీల్ చైర్స్,) అలాగే, ఏదన్నా అనుకోని సందర్భంలో యాక్సిడెంట్లో కాళ్లు పోయిన వారికి ( జైపూర్ ఫుట్ ) ఆలయ ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఐఏఎస్ నరహరి అయితే.. తెలంగాణ రాష్ట్రం లొ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరియు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో, ఆలయ ఫౌండేషన్, నలుమూలల, తనకు ఉన్న పరిచయాలతో, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్.. ను సంప్రదించగా, నిజమైన నిరుపేదలకు, ఎంతో కొంత సహాయం చేయాలని, అన్న బాటలో తమ్ముడిగా అడుగుపెట్టిన, గాదె గుణసాగర్, ఆలయ ఫౌండేషన్ కార్యక్రమాలని, తన వంతు సహాయంగా, అందించడం జరుగుతుంది. శంకర్ హై విజన్ హాస్పిటల్.. తన సొంత డబ్బులతో తన తండ్రిగారైనటువంటి పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థంగా , పెద్దపెల్లి జిల్లా వసంత్ నగర్ లో నిర్మించారు.నిర్మించిన సంవత్సర కాలం లొ నిరుపేదలైనటువంటి 2000 మందికి కంటి ఆపరేషన్ ఉచితంగా శంకర్ ఐ విజన్ హాస్పిటల్ లో జరిపించారు.ఈ హాస్పిటల్ కు సంబంధించిన స్పెషల్ డాక్టర్స్ ను ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణ సాగర్ పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలా ఉన్నటువంటి నిరుపేదలకు, ఉచిత సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుల ఐఏఎస్ నరహరి 49వ జన్మదినం సందర్భంగా ఎంతోమంది పెద్దలు ఆశీర్వాదాలు తెలిపారు.
