
నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదులుకోవద్దు
మీడియా వాస్తవాలను ప్రతిబింబించాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందుకున్న ఎండి ఖాజాపాషా (కేపీ), సత్యనారాయణలకు సన్మానం
ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని జైలు పాలైనా కలాన్ని వీడని యోధులు
జర్నలిస్టు కెపి, సత్యనారాయణ లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రేణులు
జర్నలిస్ట్ శంకర్ రూపొందించిన ప్రత్యేక పాటలు ఆవిష్కరణ
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
మనం చేస్తున్న వృత్తిలో ఎన్ని అవంతరాలు ఇబ్బందులు ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతాలను విడనాడకూడదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. గురువారం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సీనియర్ జర్నలిస్టులు ఎండి ఖాజాపాషా (కేపీ), మిద్దెల సత్యనారాయణలు రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డులను సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చేతుల మీదుగా విజయవాడలో అందుకున్న సందర్భంగా వారిని ఎమ్మెల్యే శంకర్ ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ
చేస్తున్న జర్నలిస్టు వృత్తిలో ఎన్నో అవంతరాలు ఎదురవుతాయని గతంలో ఎన్నో ఇబ్బందులు జర్నలిస్టుల సంబంధించి కళ్లారా చూసామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా సరే నమ్ముకున్న సిద్ధాంతాలను విడనాడకుండా సమాచారమే పరమావధిగా భావించి ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనత సీనియర్ జర్నలిస్టులు కేపీ, సత్యములదని అన్నారు. వృత్తి నిర్వహణలో భాగంగా ఎన్నో అక్రమ కేసులు, జైలు జీవితం కూడా జర్నలిస్టు అనుభవించారని అవేవీ నిలబడలేదని గుర్తు చేశారు. చేస్తున్న వృత్తిలో భాగంగా రాస్తున్న వాస్తవాలు కఠోర నిజాలు కొంతమంది జీర్ణించుకోరని ఆక్రమంలో అక్రమ కేసులు పెడతారని గుర్తు చేశారు. కొందరు పైసాచిగా ఆనందం కోసం జర్నలిస్టులపై ఇంకా అక్రమ కేసులు పెట్టుకుంటూనే ఉన్నారని వివరించారు. జర్నలిస్టులు
వీటికి భయపడకుండా నిజాన్ని నమ్ముకుని పాత్రికేయ వృత్తిలో రాణిస్తూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందుకోవడం షాద్ నగర్ నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. ఉత్తమ పురస్కారాలు సాక్షాత్తు భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ ద్వారా తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు. జర్నలిస్ట్ శంకర్ రూపొందించిన పాటలు విడుదల షాద్ నగర్ జర్నలిస్ట్ దిర్శనం శంకర్ రూపొందించిన రెండు ప్రత్యేకమైన గీతాలను ఎమ్మెల్యే శంకర్ ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ కెపి పై రూపొందించిన పాటతో పాటు ఎమ్మెల్యే శంకర్ పేరిట రూపొందించిన మరో గీతాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ల్యాప్టాప్ ద్వారా ఆవిష్కరించారు. పాటకు సాహిత్యం గొప్పగా రాశారని శంకర్ ను పలువురు అభినందించారు. జర్నలిస్టులుగా ఉంటూ సమాజసేవలో అక్షర సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండే జర్నలిస్టులు తన ప్రాంతాల్లో ఉండడం గర్వకారణం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, పట్టణ పార్టీ అధ్యక్షుడు చెన్నయ్య, రఘునాయక్, మైనార్టీ నేత ఇబ్రహీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్, మాజీ ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్, జంగారి రవి, కొత్తపేట ఉస్మాన్, తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్, అనిల్ కుమార్, ముబారక్ ఖాన్, చిన్న, సయ్యద్ ఖదీర్, రంగాపూర్ మహేందర్, పెంటయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
