
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 17:ములుగుజిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మరియు టిబి ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలువాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరధి లోని గ్రామాలలో ఆశా కార్యకర్తలు15 మందిని గుర్తించి వాజేడు ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగిందనీ, వారి తెమడ సేకరించి వెంకటాపురం ఎస్ టి ఎల్ ఎస్ రవి ద్వారా పంపించడం జరిగిందనీ వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ కొమరం మహేంద్ర పత్రిక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని,అంతేకాకుండా క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈయొక్క కార్యక్రమంలో వాజేడు ప్రాథమిక వైద్యాధికారి కొమరం మహేంద్ర,హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి,ల్యాబ్ టెక్నీషియన్స్ రజనీకాంత్,రవి,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మరియు ఆశా కార్యకర్తలు రవణమ్మ,కళావతి. లక్ష్మి,పేషెంట్లు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు.
