
{ పయనించే సూర్యుడు} {న్యూస్ అక్టోబర్15}
మక్తల్ ప్రాంతానికి చెందిన జాతీయ వాలీబాల్ ప్లేయర్ పుల్లారి అనన్య శ్రీ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.మంగళవారం జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా అనన్య సాధించిన సీనియర్ నేషనల్ గోల్డ్ మెడల్, ఎఫ్.ఐ.ఎస్.యూ వరల్డ్ యూనివర్సిటీ మెడల్ ఇతర స్థాయిలో సాధించిన మెడల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించడం జరిగింది.ఈ సందర్భంగా అనన్యను ముఖ్యమంత్రి అభినందించి శాలువాతో సన్మానించడం జరిగింది.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ పుల్లారి ఆనంద్,వరలక్ష్మి,ఆదిత్య సౌర్య తదితరులు పాల్గొన్నారు
