
పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొన సాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిముషాల ప్రాంతంలో. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మవోయి స్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో సి ఆర్ పి ఎఫ్ కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. రెండు వందల తొమ్మిది కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ కోబ్రా, దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి, ఇందులో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికార వర్గాలు తెలిపాయి.