
ప్రజలకు అందాల్సిన ఆహార పదార్థాల లో 25 కోట్ల అవినీతికి పాల్పడిన జీసిసి అధికారులు సోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
2020 నుండి ఇప్పటివరకు జీసీసీలో పనిచేసిన అధికారుల ఆస్తులపై సిబిఐ ఎంక్వయిరీ చేయించాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది. 09. 04.2025
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, ఏప్రిల్ 9: చింతూరు కేంద్రంగా ఉన్న గిరిజన సహకార సంస్థలో అవినీతి తారాస్థాయికి చేరిందని, జిసిసి సంస్థ ప్రజల కంటే అందులో పని చేస్తున్న అధికారులకి లాభాలు చేకూర్చే సంస్థగా మారిందని, అవినీతికి పాల్పడుతూ వేల రూపాయలు జీతాలు గల అధికారులు లక్షల రూపాయల కూడా పెడుతున్నారని, తక్షణమే ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని జిసిసి లో జరిగే అక్రమాలపై విచారణ చేయాలని, అందులో 2020 నుండి ఇప్పటి వరకు పనిచేసిన అధికారుల అక్రమ ఆస్తులపై సిబిఐ విచారణ చేయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పల్లపు.వెంకట్ డిమాండ్ చేశారు. విలీన నాలుగు మండలాల్లో ఉన్న కార్డు హోల్డర్లకు నిత్యవసరాలు అందించే లక్ష్యంతో మరియు గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసే సంస్థగా జిసిసి ఏర్పడిందని అన్నారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత నుండి జిసిసి ప్రజల కంటే, అధికారులకే మంచి లాభాలు చేకూరుస్తుందని విమర్శించారు. ఇప్పటికే 25 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు తీసినప్పటికీ జరుగుతున్న అవినీతి మాత్రం ఆగడం లేదని అన్నారు. గూడం ఇన్చార్జులు సస్పెండ్ అవుతున్న, ఆ స్థానంలో తీసుకువచ్చే అధికారులు గుదాం ను గాలికి వదిలేస్తున్నారని తెలిపారు. ఎక్కడ అవినీతికి పాల్పడిన అధికారులను తీసుకువచ్చి ఇక్కడ పోస్టింగులు ఇస్తున్నారని దానితో వారు మంచి చేతివాటం చూపిస్తున్నారని అన్నారు. విచారణ స్ట్రాంగ్ తాత్సారం చేస్తూ అధికారులు కాలం గడుపుతున్నారని అన్నారు. ప్రజలకు అందాల్సిన నిత్యవసరాలు పక్కదారి పట్టి అధికారులకు లాభాలు చేకూరుస్తున్నాయని అన్నారు. 25 కోట్ల అవినీతి జరిగిందని అధికారికంగా విచారణలో తేలినప్పటికీ చర్యలు లేకపోవడం దుర్మార్గమన్నారు. సివిల్ సప్లై లో కూడా సస్పెండ్ చేసిన అధికారులని మరల కొనసాగించడం దేనికి సంకేతమొ అధికారులు తెలపాలన్నారు. తక్షణమే జిసిసి ని ప్రక్షాళన చేసి, 2020 నుండి ఇప్పటివరకు చింతూరు జిసిసిలో చేసిన అధికారుల ఆస్తులపై సిబిఐ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలందరిని సమీకరించి ఆందోళనకు సిద్ధమవుతామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు, కారం మనోజ్, శేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.