
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో
ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ)జిల్లా ఉపాధ్యక్షులు కె. రాజేశ్వర్ పిలుపు ఇచ్చారు. భీంగల్ మండల కేంద్రంలో దేశవ్యాపిత సార్వాత్రిక సమ్మె పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందన్నారు. మోడీ కార్మికులకు సమ్మెహక్కుకూడా లేకుండా చేశాడు అన్నారు. ఆదాని అంబానీలకు సర్వం ధారా దత్తం చేసి కార్మికులను బలి పశువులు చేశారన్నారు. ప్రస్తుతం కార్మిక వర్గం ఐక్యమై పోరాడితే తప్ప తమ హక్కులను కాపాడుకోలేమన్నారు. 11 గంటల పని దినాలు తెచ్చి కార్మికులపై పెను భారం వేశారన్నారు. ఎనిమిది గంటల పని దినంకై పోరాడిన చరిత్ర కార్మికులదని కార్మికుల హక్కులను కాలరాశి ఇలా కట్టు బానిసలు చేశారన్నారు. కార్మిక వర్గానికి పోరాటమే తప్ప మరో మార్గం లేదన్నారు.పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో టియుసిఐ నాయకులు ఓంకార్ రాజన్న బాలన్న గంగాధర్ మనోహర్ గంగ అక్క రాజమణి లక్ష్మి పోషవ్వ లతోపాటు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
