
పయనించే సూర్యుడు మార్చి 25 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో మరో మృతదేహం ఆనవాళ్లు రెస్క్యూ సిబ్బంది ఈరోజు గుర్తించినట్టు సమాచారం. అయితే ఇది మృతదేహం అవునో?కాదో అనే విషయాన్ని తేల్చేం దుకు అధికారులు మంగళవారం టన్నెల్ లోకి వెళ్లారు. టన్నెల్ లో లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో ఇది మానవ మృతదేహం గా అనుమానిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్‌తో పాటు ఇతర ఆధునాతన టెక్నాలజీ సహాయంతో గుర్తించిన ప్రదేశం కాకుండా మరో ప్రదేశంలో మృతదే హం ఆనవాళ్లు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాలను డీ1, డీ2 గా గుర్తించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమా దంలో 42 మంది కార్మికులు సురక్షితంగా తప్పించుకు న్నారు. మరో ఎనిమిది మంది టన్నెల్ లోనే చిక్కుకున్నారు. ఎనిమిది మందిలో టీబీఎం ఆపరేటర్ మృతదేహన్ని ఇటీవల వెలికి తీశారు. ఎస్ఎల్‌బీసీలో సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి మార్చి 24న సమీక్ష నిర్వ హించారు. రెస్క్యూ జరుగు తున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. సహాయక చర్యలకు టన్నెల్ లో పరిస్థితులు ఏ రకంగా ఆటకం కలిగిస్తున్నాయో కూడా వివరించారు. ప్రతి కూల పరిస్థితుల నేపథ్యం లో సహాయక చర్యలు కొనసాగిస్తున్న విషయాన్ని అధికారులు సీఎంకు తెలి పారు. సహాయక చర్యలను కొనసాగించాలని అధికారు లకు సీఎం ఆదేశించారు.