
సరుకులను అందిస్తున్న డాక్టర్ రాజ్ కుమార్.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్ర పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిక్షయ్ పోషణ యోజన కింద టీబి రోగులకు పోషక విలువలతో కూడిన సరుకులను మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం టిబి రోగులకు వితరణ చేశారు.సాలూర మండల పరిధిలో 9 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వెల్లడించారు.9 మంది టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని ప్రతి నెల సుమారు రూ 500 విలువ గల సరుకులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.సరైన సమయంలో టిబీని గుర్తించి చికిత్స అందిస్తే రోగాన్ని నివారించవచ్చు అని స్పష్టం చేశారు.టీబీ రోగులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలను డాక్టర్ వివరించారు.డాక్టర్లు తెలియపరిచిన సూచనలు సలహాలు పాటించి పోషకాలతో కూడిన ఆహారాన్ని మరియు మందులను సమయానుగుణంగా వాడినట్లయితే ఎలాంటి వ్యాధినైనా నివారించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీబి సూపర్డెంట్ ఆషన్, హెల్త్ సూపర్వైజర్ సాయి కుమారి, స్టాఫ్ నర్స్ శ్వేత, సూపర్డెంట్ సత్యం, ఆశ వర్కర్ నాగ లత, మరియు టీబీ వ్యాధిగ్రస్తులు తదితరులు పాల్గొన్నారు.