
పయనించే సూర్యుడు జులై 08 (పొనకంటి ఉపేందర్ రావు)
మంగళవారం టేకులపల్లి బోడు క్రాస్ రోడ్డు నందు ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా టేకులపల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా శ్రేయసు కొరకు చేసినటువంటి ఎన్నో ప్రజాదరణ కలిగినటువంటి ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఆ యొక్క పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు అనేక నీటి ప్రాజెక్టులు తనదైన ప్రత్యేక ముద్ర వేసి అమలు చేశారు వారు చేసినటువంటి అభివృద్ధి పథకాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్,మండల అధ్యక్షులు దేవానాయక్, రెడ్యానాయక్, పోశాలు, మధురెడ్డీ, వీరభద్రం,సంజయ్,లక్ష్మయ్య,భూక్యా సర్దార్, బానోత్ రవి, గాంధీ, సేవ్యా,శేఖర్, సునీల్, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.