
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు… టేకులపల్లిలో మంగళవారం ప్రారంభమైన గ్రామ సభ లు మండలాల్లో ఎంఈడీఓ, తహశీల్దార్, ఎంపీఓ, ఎంఏఓ లతో నాలుగు టీములు ఏర్పాటు చేశారు. టేకులపల్లిలో 36 పంచాయితీలు ఉండగా, గ్రామ సభలు నిర్వహితున్నారు. టేకులపల్లి మండలంలో 21న ఎంపీడీఓ టీమ్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్, రాంపురం, చుకాలబోడు, తహశీల్దార్ టీమ్ రాళ్ళపాడు, పెత్రంచెలక, ఎంపీఓ టీమ్ కుంటాల, ఎర్రాయిగూడెం, ఎంఏఓ టీమ్ మొక్కంపాడు, బర్లగూడెం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపికలు ఏకపక్షంగా చేస్తున్నారని ఆరోపించగా అధికారులు దానిని ఖండిస్తున్నారు. అవసరమైతే మరోమారు విచారణ చేస్తామంటున్నారు. టేకులపల్లి మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవీందర్ రావు, తహశీల్దార్ నాగభవాని, ఎంపీఓ గాంధీ, ఎంఏఓ అన్నపూర్ణాలతో పాటు, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.