పయనించే సూర్యుడు/జనవరి 13/కాప్రా ప్రతినిధి సింగం రాజు:మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశంతో ప్రారంభమై మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండి సుఖశాంతులలో జీవించాలని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుంకు శ్రీకాంత్ రెడ్డి, సోమవారం ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగాడివిజన్ ప్రజలకు భోగి,సంక్రాంతి,కనుమ, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలన్నారు. జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.పతంగులు ఎగురవేయడం సరదాగా కనిపించినప్పటికీ,కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి ఈ సూచనలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి:భవనాలపై పతంగులు ఎగురవేయడం: పై నుంచి కింద పడే ప్రమాదం ఉంది. భద్రతను పాటిస్తూ పతంగులు ఎగురవేయండి. మాంజా దారాల వినియోగం ఇవి మెడకు చుట్టుకుపోయే అవకాశం ఉంది,ఆ పరిస్థితి ప్రాణాపాయంగా మారొచ్చు.విద్యుత్ స్థంభాలు, తీగలు వద్దట్రాన్స్‌ఫార్మర్లు లేదా విద్యుత్ వైర్ల దగ్గర పతంగులు ఎగురవేయడం ప్రమాదకరం. విద్యుత్ తీగలపై పతంగులు పడితేవాటిని తీసుకోవడానికి ప్రయత్నించకూడదు.ప్రమాదం జరగొచ్చు. పక్షులకు ప్రమాదం తెగిపోయిన పతంగుల దారాలు పక్షుల మెడలకు బిగుసుకుని వాటి ప్రాణాలు తీసే అవకాశం ఉంది.కాబట్టి పతంగులను ఖాళీ ప్రదేశాల్లో, భద్రతా నియమాలను పాటిస్తూ ఎగురవేయండి! అని తెలిపారు.