రుద్రూర్, జనవరి 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలం జవహర్ నగర్ కాలనీలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. ఇంటి యజమాని జలీల్ కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. సోమవారం పని మనుషులు వచ్చి చూసేసరికి తాళం పగుల కొట్టి ఉండడం, ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతో వారు వెంటనే యజమానికి సమాచారం అందించారు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి ఫింగర్ ప్రింట్ బృందం కోసం వేచి చూస్తున్నారు