Tuesday, March 4, 2025
HomeUncategorizedతెలంగాణ విభజన హామీలు గాలికి వదిలేసిన కేంద్రబడ్జెట్.జి వెంకట్రామిరెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు

తెలంగాణ విభజన హామీలు గాలికి వదిలేసిన కేంద్రబడ్జెట్.జి వెంకట్రామిరెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 3//మక్తల్ బయ్యారాం ఉక్కు పరిశ్రమ,ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా, హై స్పీడ్ రైల్వే లైన్ తదితర కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హమీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ లో ప్రస్తావించలేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి జిల్లా కార్యదర్శి బాల్‌రాం విమర్శించారు. సోమవారం (మార్చి 1న) సోమవారం రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గ కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో సదస్సు జరిగింది. సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆద్వర్యంలో సిఐటియు జిల్లా నేత గోవింద్ రాజ్ అధక్షతన జరిగిన జిల్లా సదస్సుకు వారు మఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సబ్సీడీల తగ్గింపు, జాతీయ గ్రామీణ ఉపాధికి సరిపడు నిధులు కేటాయించపోవడం దారుణమన్నారు . ఆకలిసూచిలో భారత దేశం 105 వ స్థానంలో ఉందని, సేంద్రియ పంటలకు వెళ్లితే పంటకు దిగుబడి తగ్గుతుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత దేశవ్యాప్తంగా 1 లక్షమంది రైతుల ఆత్మ హత్యలు జరిగాయని ఆయన అన్నారు. వ్యవసాయ పరిశోధనను ప్రైవేట్ వారికి అప్పజెప్పేందుకు నిర్ణయించినారని,ఉపాధి హామీ పథకం కు అరకొర నిధులు 86 వేల కోట్లు కేటాయించారు. కనీసం 3 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడా పారిశ్రామిక వేత్తలకు 22 శాతం పన్ను ఉద్యోగస్తులకు మాత్రం 30 శాతం పన్ను వేస్తున్నారు, దేశంలో 1శాతం మంది సంపన్నుల చేతిలో 40 శాతం సంపద కేంద్రీకరించబడిందన్నారు. బీమా కాంపెనీలకు 25 శాతం పంటల భీమ డబ్బులు వెల్తున్నాయని విమర్శించారు . 100 మంది నుండి 200 మంది బిలియనీర్లు అయ్యారు తప్ప దేశంలో పేదరికంనిర్మూలించబడలేదన్నారు. అంతర్జాతీయంగా 18 శాతం ముడి చమురు రేట్లు తగ్గినా పెట్రోల్‌డిజిల్ ధరలు తగ్గడం లేదు, మిర్చి రేటు క్వింటాల్ కు 50 వేల నండి 15 వేలకు పడిపోయింది. పత్తి,ధరలు తగ్గాయి. ధరల స్థిరీకరణ నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నదన్నారు. పప్పులు నూనెలు విదేశాలనుండి దిగుమతి అవుతున్నాయి.14 రకలా చౌక ధర దుకాణాల ద్వారా అందివ్వాలి అని అన్నారు .కార్మిక కనీస వేతనం,ఉద్యోగ భద్రత,ప్రమాద భీమా సౌకార్యాల గురించి పట్టించుకోలేదన్నారు. ఈ సదాస్సు లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పుంజనూర్ ఆంజనేయులు మెప్మా ఆర్పీ ల యూనియన్ జిల్లా నాయకులు జ్యోతి,ఆశా యూనియన్ నాయకులు గోవిందమ్మ ఎస్ఎఫ్ఐ నేతలు నర్సింహ,నయ్యుం మాట్లాడారు , ఈ కార్యక్రమంలో యశోద, ఎల్లప్ప, శివ, వెంకటేష్ ఆంజనేయులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments