
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 23//మక్తల్ ప్రాచీన కళలకు జీవం పోస్తూ బతుకు బండిని నెట్టుకొస్తున్న బేడ (బుడగ) జంగాలు దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోవడం లేదు పట్టన & గ్రామ పరిసరాల్లో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు మారుతున్న కాలానుగుణంగా కళలకు ఆదరణ కరువై పోవడంతో వారి జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది గుమ్మెట తంబుర హార్మోనియం తబలతో యక్షగానం చేస్తూ తమ కళా నైపుణ్యంతో ప్రజలను అబ్బుర పరిచే వారు ప్రస్తుతం టీవీ సీరియల్స్ సినిమాల ప్రభావంతో వీరి కళలకు ప్రాచూర్యం లేకుండా పోయింది మక్తల్ నియోజకవర్గంలో దాదాపు రెండు వెయ్యిల కుటుంబాలకు పైగా బేడ బుడగ జంగాలు నివసిస్తున్నారు మక్తల్ పట్టణంలోనే 300 వందల కుటుంబాల బుడగ జంగాలు నివసిస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు వీరికి ఆమడ దూరంలో ఉన్నాయి ఇల్లు పొలాలు ఆస్తులు వీరి వద్ద అసలే లేవు మూడు వంకర్ల కర్రలపై పాత చీరలు చిరిగి పోయినా దుస్తులు నాయకులు వదిలేసిన ఫ్లెక్సీలను గుడిసెలపై కప్పుకుని వాటిలోనే ఏళ్ల కాలంగా పసి పిల్లలతో జీవనం సాగిస్తున్నారు గుడర పరిసరాల్లో విష సర్పాల మధ్య బిక్కు బిక్కు మంటూ శతాబ్దాలుగా కాలం వెళ్లదీస్తున్నారు ఎలాంటి చేతి వృత్తి లేని ఈ బుడగ జంగాలు యాచక వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు పెన్షన్లు ఆహారభద్రత కార్డులు కూడా లేవు ఎన్నికళ సమయం లో మాత్రమే నాయకులు హామీలు గుప్పిస్తున్నారు ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు గత పాలకుల నిర్లక్ష్యమే ఇలాంటి దుర్బర జీవితాలకు కారణం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గౌరవ శ్రీ వాకిటి శ్రీహరి గారు స్పందించి ఊరి చివర గుడిసెల్లో నివసిస్తున్న బేడ బుడగ జంగాలకు ఇందిరమ్మ ఇళ్లు స్థలాల ఇవ్వాలని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు రాసురి భీమేష్ కోరారు
