
ప్రభుత్వాల రాజకీయ కుట్రలకు ముగింపు పలుకుదాం
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 27
శనివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎట్టపాక మండలం లక్ష్మీపురం గ్రామం తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి( మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ AVSP తెలుగు రాష్ట్రాల కన్వీనర్ ) కుంజ శ్రీను రెండు రాష్ట్రాల కార్యకర్తలతోటి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 3దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులను, రిజర్వేషన్ ఫలాలను ఎస్టీలు కానీ లంబాడీలకు మరియు నాన్ ట్రైబల్స్ కు దోచిపెడుతున్న పాలక ప్రభుత్వాల రాజకీయ కుట్రలకు చమర గీతం పాడే అంతిమ యుద్ధమే 28న భద్రాచలంలో జరిగే ధర్మ యుద్ధమని, ఈ ఉద్యమానికి రెండు రాష్ట్రాల ఆదివాసీలు, ఆదివాసి ప్రజాప్రతినిధులు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఆదివాసి రిజర్వేషన్ ఫలాలను అనుభవించిన ప్రజాప్రతినిధుల చేతగానితనం వల్లనే రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం లంబాడాలను ఎస్టీ జాబితాలో కలవడం జరిగిందని. అంతేకాక మరోపక్క 1/70 చట్టం అమల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి చట్టాలు అమలు కాకుండా ఓట్ల కోసం నాన్ ట్రైబల్స్ ను రాజకీయ పార్టీలు, ఆదివాసి ప్రజాప్రతినిధులు పెంచి పోషిస్తూ వచ్చారని. నేడు అవే విషపు పాముల తిరిగి ఆదివాసులు కాటేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చేసే ఉద్యమం నేటిది కాదని గత 25 సంవత్సరాలుగా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉందని. ఈ ఉద్యమంలో ప్రస్తుతం కొంతమంది ప్రజాప్రతినిధులు భాగ్యస్వామ్యం కావటం ఆదివాసీలు హర్షించదగ్గ విషయమని ఇదే బాటలో మిగిలిన తెలుగు రాష్ట్రాల ఆదివాసి ప్రజాప్రతినిధులు జతకట్టి రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్ ఫలాలను లంబాడీలకు, నాన్ ట్రైబల్స్ కి దోచిపెడుతున్న ప్రభుత్వాలపై ఉద్యమించాలని ఆయన డిమాండ్ చేశారు. 1952 నుండి ఆంధ్ర ప్రాంతాల్లో, 1976 నుండి తెలంగాణ ప్రాంతాల్లో ఆదివాసులకు దక్కాల్సినటువంటి విద్య ఉద్యోగ రాజకీయ ఫలాలు అన్నీ కూడా లంబాడ, బంజార, సుగాలీలు అక్రమంగా దోచుకున్నారని. దీనికి ప్రధాన కారణం పాలక ప్రభుత్వాలు ఆనాడు ఆదివాసులకు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అని ఆయన విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న లంబాడీ వ్యతిరేక ఉద్యమాలు రాజకీయాలకు అతీతంగా జరగాలని గతంలో కొంతమంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం లంబాడాల ఉద్యమాన్ని వాడుకున్నారని ఈసారి అటువంటి ప్రయోజనాల కోసం లంబాడ వ్యతిరేక ఉద్యమాన్ని వాడుకుంటే యావత్ ఆదివాసి ప్రజానీకం మొత్తం వారికి బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు. రేపు అనగా 28 తేదీన లంబాడ, బంజారా, సుగాలి లను తొలగించాలని భద్రాచలం వేదికగా జరుగుతున్న ధర్మ యుద్ధంలో ఆదివాసీలు విల్లంబులు ఎక్కుపెట్టి కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగ చట్టాలు హక్కులు రిజర్వేషన్ దోపిడిపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతి ఆదివాసి సోదర సోదరీమణులకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ ఆదివాసి కార్యకర్తలు సరియం వెంకటేష్, శ్యామల గోవిందా, తాటి ఉదయ్, కుంజా పరమేష్, కాకా రామకృష్ణ, కుర్సం రవి, అప్కా అర్జున్, పూనెం శ్రీరామ్ ప్రసాద్, జగిడి శ్రీను, అప్కా సమ్మయ్య, జగిడి బిక్ష పతి, ఉబ్బ బాలకృష్ణ, కల్లూరి శ్రీను, కుర్సం బాలు. తెల్లం బాలు, పూసం రామకృష్ణ, కల్లూరి రామకృష్ణ.
తదితరులు పాల్గొన్నారు