
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాల వద్ద మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కొత్తూరు, దూసకల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద పూజలు చేసి గ్రామాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అభిప్రాయపడ్డారు. తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించడం సంతోషకరమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నారని అన్నారు. ఈ దసరా పండుగ అందరి కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని, కుటుంబ సభ్యులుఈ కార్యక్రమంలో సంతోషంగా పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి, నాయకులు దేవేందర్ యాదవ్, నరసింహా, కృష్ణ, బాబూరావు, తుమ్మల జగన్, యాదయ్య, రమేష్, కుమార్, బాలు, శివ, అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
