
(పయనించే సూర్యుడు అక్టోబర్ 13 రాజేష్)
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి సూరంపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియం చేసుకోవాలని ఆర్ ఐ నాగరాజు, ఐకెపి ఎపిఎం మైపాల్ అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్, ముబారస్ పూర్, సూరంపల్లి తదితర గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సూరంపల్లి మాజీ సర్పంచ్ అయ్యంగారి నరసింహులు, ఏఈఓ సంతోష్,సిసి బాలరాజు, నాయకులు తలారి నరసింహులు, ఏలూరి నరసింహులు,యాదగిరి, సాయిలు . కిరణ్, రాజు .శ్యామ్ సుందర్ రెడ్డి,సిఏలు మహేందర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.
