
పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
- ధాన్య కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
- కూసుమంచి మండలం పాలేరు ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చెందిన అదనపు కలెక్టర్ ఖమ్మం
జిల్లాలో ధాన్య కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ కూసుమంచి మండలం లోని పాలేరు లో ఏర్పాటుచేసిన ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలు, ట్యాబ్ ఎంట్రీ, రైతులకు డబ్బు చెల్లింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం వచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలని, కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీ చేసి, సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ ప్యాడీ క్లినర్ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పనితీరును అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాల కల్పన చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు. అదనపు కలెక్టర్ తనిఖీల సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, అధికారులు తదితరులు ఉన్నారు.
