
పయనించే సూర్యడు జనవరి 11 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శనివారం నడిగూడెంలోని శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో కుడారే ఉత్సవం నిర్వహించారు గోదాదేవికి పాయసం నైవేద్యం సమర్పించి మహిళా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలతో సారే పోశారు ఆలయ పూజారి శేష భట్టార్ వరధాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు బి వెంకటరత్నం వందనపు సూర్యప్రకాశరావు మహేష్ మోహన్ సత్యనారాయణ రత్నం మహిళా భక్తులు పాల్గొన్నారు. సోమవారం కోదండ రామాలయంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.