
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లు నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 2
సోమవారం నాడు ప్రజా గ్రీవెన్స్ నందు రంపచోడవరం ఐటీడీపీఓ గారికి, రంపచోడవరం మండలంలోని నరసాపురం గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న మెటల్ క్వారిపై ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే, అయితే ఈ విషయంపై వెంటనే స్పందించిన ఐటీడీఏ పీవో గారు సంయుక్త దర్యాప్తు( మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, మరియు రంపచోడవరం సబ్ కలెక్టర్ వారికి )ఆదేశించడం అయినది. అయితే ఈ విషయంపై అక్రమ మైనింగ్ మాఫియా రెచ్చిపోయి నరసాపురం గ్రామస్తులను కొంతమందిని డబ్బుతో కొనాలని ప్రయత్నం చేసింది మరి కొంతమందిని కూర్చొని చర్చించటానికి రావాలని మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపుతున్నారని, మరి కొంతమందిని ఇప్పటికే భయపెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని కావున ఐటీడీఏ పిఓ గారు తక్షణమే స్పందించి అక్రమ మైనింగ్ దారులపై క్రిమినల్ కేసులు వెయ్యాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కోరారు. సమగ్ర దర్యాప్తు అంటే అధికారులు స్థానికంగా వెళ్లి చేయాల్సిన దర్యాప్తు ఆని , కానీ ఈ విషయంలో స్థానిక విఆర్ఓ గారు గతంలో ఐటీడీఏ పీవో గారికి గ్రామస్తులు తరఫున ఫిర్యాదు చేసిన వాళ్ళని ఫోన్లు చేసి ఇక్కడకు రావాలని అక్కడకు రావాలని కూర్చొని చర్చించుకోందామని మాఫియా దారులకు అండగా మాట్లాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇన్ని రోజుల్లో కనిపించని గ్రామ అభివృద్ధి, PO గారికి ఫిర్యాదు చేయగానే రోడ్డు గుంతలు పూడుస్తున్నట్లు మట్టి పోయటం కంకర పోయటం వంటి పనులు చేస్తున్నారని మరి ఇన్ని రోజులు గ్రామ అభివృద్ధి గుర్తుకు రాలేదా అక్రమ మైనింగ్ మాఫియా దారులకు అని విమర్శించారు. బినామీ పేరుతో ప్రభుత్వ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్స్ తోటి లైసెన్స్ పొంది , గతంలో ఉన్న రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి NOC తీసుకొని కోట్ల రూపాయల మైనింగ్ బిజినెస్ చేశారని వీటన్నింటిపై ఆదివాసి సంక్షేమ పరిషత్ క్షేత్రస్థాయి దర్యాప్తు చేసి అక్రమాలను వెలికి తీసి ఐటీడీఏ పీవో గారికి , మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ అండ్ డైరెక్టర్ వారికి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) వారికి ఫిర్యాదు చేయటంతో అక్రమాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని , దీంతో ఏం చేయాలో అర్థం కాక స్థానిక ప్రజలను నయానో భయానో బుజ్జగించే, బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వీటన్నిటికీ స్థానిక వీఆర్వో సహకరిస్తున్నట్లు తమ దృష్టిలో ఉందని కావున వీటన్నిటి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీవో గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపితేనే అధికారులకు అన్ని రకాల అక్రమాలు బయటపడతాయని ఆయన తెలిపారు. తప్పుడు తడకలలో దర్యాప్తు జరిపి అక్రమ దారులను వదిలిపెడితే అవసరమైతే న్యాయస్థానంలో పోరాడుతామని హెచ్చరించారు. నరసాపురం లో ఉన్న మెటల్ క్వారీ తోపాటు రంపచోడవరం నియోజకవర్గం లో అక్రమంగా కొనసాగుతున్న వైట్ మెటల్ క్వారీ, గ్రైనేట్ మైనింగ్, బ్లాక్ మెటల్ క్వారీ అన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.