ఎన్టీఆర్ జిల్లా తిరువూరు
రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా తిరువూరు పట్టణంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. పయనించే సూర్యుడు జనవరి 24 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో లోకేష్ బాబు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు.. అన్న నందమూరి తారక రామారావు మరియు రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. అనంతరం పట్టణంలో ఫ్యాక్టరీ సెంటర్ జైభావి సెంటర్ బోసుబొమ్మ సెంటర్ రైతు బజార్ దగ్గర మరియు అన్న క్యాంటీన్ దగ్గర భారీ కేక్ కటింగ్ నిర్వహించారు.. లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా పట్టణంలోని పలు అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఎన్నో ఒరిడుగులన్నీ తట్టుకొని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని ప్రజల ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి లోకేష్ ఉండాలని ఆశించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..