
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ పట్టణంలో
. బుధవారం రోజున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భీమ్గల్ పట్టణంలో ఆయా రంగాల కార్మికులు స్థానిక ఎండిఓ కార్యాలయం నుండి ప్రధాన రహదారి వెంట అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి లేబర్ కోడ్ ను రద్దు చేయాలని, పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని, మీ సవేతనం 26,000 ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంతకుముందు ఎండిఓ కార్యాలయం వద్ద జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చే పనిలో భాగంగా కార్మిక చట్టాలను సవరించి పోరాడి సాధించుకున్నటువంటి కుదించి హక్కులను కుదించి నాలుగు కోట్లుగా మార్చిందని దీనివల్ల కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా చట్టాల్లో సవరణలు తేవటం సంక్షేమ పథకాల అమలులో కోతలు విధించడం, పని గంటల పెంపును నిర్ణయించటం పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్య అని దీని మూలంగా పెట్టుబడిదారులు మరింత ఆస్తులు సంపాదించుకోవటానికి అవకాశం కల్పించారని ఆయన విమర్శించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పడుతూ ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచుతూ 282 జిఓ ని తీసుకురావటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని అర్థం చేస్తుందని ఆయన అన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా ఐక్య పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు పియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వాల కార్మికుల శ్రమను దోచి కార్మికుల శ్రమను దోచి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నారని నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను 26 వేలకు పెంచాలని లేబర్ కోడ్లను రద్దు చేయాలని లేనియెడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఐఎఫ్టియు నాయకులు అల్తాఫ్ మాట్లాడుతూ సంఘటిత పోరాటాల ద్వారానే కార్మికుల హక్కులు సాధించబడతాయని తెలిపారు అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే దేవగంగు మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో కార్మిక వర్గం పోరాటాల్లోకి రావడం జరుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వాలు తన విధానాలను మార్చుకొని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శంషాద్దీన్ అంగన్వాడి యూనియన్ నాయకులు జ్యోతి, యమునా, ప్రమీల, చంద్రకళ, భాగ్యలక్ష్మి మున్సిపల్ యూనియన్ నాయకులు, మహేందర్, పోషన్న , గంగవ్వ, బీడీ యూనియన్ నాయకులు అశోక్, లక్ష్మణ్, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
