
-ఉద్యోగ రూపకల్పనలో ముందువరుసలో ఉంటా.
-ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి.
-రాయికల్ పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 21 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ నిరుద్యోగులకు అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకే తాను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి వెల్లడించారు.మంగళవారం రాయికల్ మండలంలో పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగ, నిరుద్యోగ,పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఒక మంచి ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు.నిరుద్యోగులకు అండగా ఉంటూ,ఉద్యోగ రూపకల్పనలో ఉంటానని వెల్లడించారు.ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చేదోడు – వాదోడుగా ఉంటూ వారికి ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ కార్డుల మంజూరుకి కృషి చేస్తానని పేర్కొన్నారు.తాను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వచ్చే వేతనాన్ని ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి నిరుపేద ఉపాధ్యాయులకు, నిరుద్యోగ పట్టబద్రుల సంక్షేమానికి వెచ్చిస్తానని వెల్లడించారు. విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చిన తాను రాజకీయ రంగంలో కూడా నూతన ఒరవడి సృష్టిస్తానని వెల్లడించారు. రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ బాలె శేఖర్, కైరం సత్యం, ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి,మచ్చ గంగాధర్, నిఖిల్ కుమార్, లలిత, నివేదిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.