
నియోజకవర్గానికి చెందిన 62 మంది లబ్ధిదారులకు మంజూరైన
35 లక్షల 28 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఆగస్టు 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన సంద సత్యనారాయణకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పార్టీలకు అతీతంగా అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అందరినీ సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు తన వంతు సహాయం చేస్తానని సంద సత్యనారాయణ ఎమ్మెల్యే శంకరన్న కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయికల్ శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, ఎర్రోళ్ల యాదయ్య, బంగ్లకాడి శ్రీనివాస్, సంద నరసింహ తదితరులు పాల్గొన్నారు.