
కొత్తూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
నేడు కొత్తూరు మున్సిపాలిట్ బడ్జెట్ మరియు సర్వసభ్య సమావేశం సందర్భంగా నిర్లక్ష్యం వీడి కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు అధికారులను ఆదేశించారు.సర్వ సభ్య సమావేశం లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…మున్సిపాలిటీ అభివృద్ధే ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీనీ అభివృద్ధి చేసుకుందామని కోరారు. బేధాభిప్రాయాలకు తావు ఇవ్వకుండా కలిసి కట్టుగా మున్సిపాలిటీనీ అభివృద్ది చేసుకోవాలని అన్నారు. గతంలో కోట్లాది రూపాయల నిధులు మంజూరి అయినట్లు పేపర్ పై చూపించారు.కానీ పనులను ఆచరణలో మాత్రం పెట్టలేదు అని తెలిపారు.అందరం కలిసి కొత్తూర్ మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీ గా తయారు చేసుకోవటంలో భాగంగా మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు.ప్రతి మున్సిపాలిటీ సిబ్బందిని సమవ్యయం చేస్తూ వార్డుల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలని కమిషనర్ ను ఆదేశించారు.