Tuesday, April 22, 2025
Homeఆంధ్రప్రదేశ్నూతనంగా నిర్మించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను ప్రారంభించిన ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం...

నూతనంగా నిర్మించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను ప్రారంభించిన ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 పొనకంటి ఉపేందర్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు మరియు గిరిజన సాంప్రదాయాలను నేటితరం యువతీ యువకులు ఆచరించే విధంగా కృషి చేస్తున్న ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ను అభినందిస్తున్నట్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం నాడు భద్రాచలం పట్టణం లోని కుర్రాజుల గుట్టలోని ఏహెచ్ఎస్ బాలుర ఆశ్రమ పాఠశాలలో 25 లక్షల 50 వేల వ్యయంతో *నూతనంగా నిర్మించిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, అందుకు విద్యార్థులు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి వృద్ధిలోకి రావాలని అన్నారు. ఐటీడీఏ పీవో గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అహర్నిశలు గిరిజన సంక్షేమం కొరకే ఆయన పాటుపడుతున్నారని, అలాగే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా నేటితరం గిరిజన యువతి యువకులు కాపాడుకోవడానికి, ఎనలేని కృషి చేస్తూ పాతతరం గిరిజన కళాఖండాలను సేకరించి గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన అన్నారు.అనంతరం ఐటీడీఏ పీవో బి రాహుల్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులే కాక 8వ,9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పదో తరగతి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో, ఇప్పటి నుండే కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యా ఉద్యోగ సమాచారం పిల్లలందరూ తెలుసుకునే విధంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, చాలా వరకు పిల్లలు అర్థం చేసుకున్నారని, ఇప్పటినుండే తప్పనిసరిగా విద్యార్థినీ విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన అంశాలు విద్యార్థిని విద్యార్థులు అర్థం చేసుకొని వేసవి సెలవులలో ఇండ్లకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా జీవితంలో ఏమి కాదలుచుకున్నారో మననం చేసుకొని జీవితంలో స్థిరపడటానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. ప్రతిరోజు నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలిసి వారు భోజనం చవిచూశారు. వేసవి సెలవులు ఇవ్వగానే విద్యార్థులు వారి ఇండ్లకు వెళ్లిపోతారని, సంబంధిత ప్రధానోపాధ్యాయులు వార్డెన్ లు పాఠశాలల్లో ఏమైనా మైనర్ రీపేర్లు ఉంటే ఇంజనీరింగ్,గిరిజన సంక్షేమ అధికారులు పాఠశాలల నుండి వివరాలు తెప్పించుకొని వేసవి సెలవులు ముగియగానే విద్యార్థినీ విద్యార్థులు వారి పాఠశాలలకు చేరుకునే సమయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్,ఏ టి డి ఓ అశోక్ కుమార్, హెచ్ఎం నరేందర్,డి ఈ హరీష్, టి ఏ శ్రీనివాసరావు, ఏ ఈ ప్రసాద్, వార్డెన్ మోహన్ మరియు పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments