
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 16
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం బుట్టాయిగూడెం గ్రామం నందుఏప్రిల్ 16న IRS ఫస్ట్ రౌండ్ దోమల మందు పిచికారి చేయడం జరిగింది ఈ సందర్భంగా నెల్లిపాక ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందితో కలిసి డిప్యూటీ డి ఎం &హెచ్ ఓ డాక్టర్ పుల్లయ్య గారు వైద్యాధికారి డా. విష్ణుప్రియ, ఆధ్వర్యంలో దోమల మందు పిచకారి( IRS) ఫస్ట్ రౌండ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా డిప్యూటీ డి ఎం& హెచ్ ఓ డాక్టర్.పుల్లయ్య గారు దోమల మందు పిచికారి గ్రామాలలో ప్రతి ఇంటింటికీ కి ప్రతి ఒక్కరూ ఈ మందు ను పిచికారి చేపించాలని, అలాగే మలేరియా రాకుండా ముందస్తు గా జాగ్రత్త చర్యగా పిచికారి చెపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సూపెర్వైజర్ , శ్రీనివాసు మూర్తి గారు. పీహెచ్ఎన్ డి అరుంధతి గారు, హెచ్ వి జి.సీతమ్మ గారు,ఏ ఎన్ ఎం లు, హెల్త్ అసిస్టెంట్స్ , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
