
పయనించే సూర్యుడు గాంధారి 02/03/25 గౌరారం కలాన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఇటీవల ఉద్యోగం సాధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎం.పెంటయ్య గారు ప్యాడ్స్ , పేన్స్ ,ను గాంధారి మండల ఎం.ఈ.ఓ శ్రీహరి గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంటయ్య గారు మాట్లాడుతూ ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు చాలామంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు వారికి ఏదో చేయాలని తన వంతు సహాయంగా ప్యాడ్స్, పెన్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులు మంచిగా చదివి పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాస్ కావాలని తెలియజేయడం జరిగింది. పెంటయ్యకు గ్రామ పెద్దలు మరియు ఉపాద్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగింది.