
పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో భీంగల్ మున్సిపల్ పరిధిలో
మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాడాలి
సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా వి. ప్రభాకర్ జిల్లా కార్యదర్శి..
139వ మే డే సందర్భంగా భీంగల్ మండల కేంద్రంలో సి యు సీఐ జెండా ఆవిష్కరణను జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్* ఆవిష్కరించడం జరిగింది.
ముఖ్యవక్త గ వచ్చిన సిపిఐ ఎం. ఎల్ జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్.. కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మేడే స్పూర్తితో కార్మిక వర్గం పై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సూర్య,చంద్రులు ఉన్నంతకాలం సుత్తి కొడవలి జెండా కార్మికుల పక్షాన రెపలాడుతూనే పోరాడుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ,కేంద్ర ప్రభుత్వం, పెట్టుబడిదారులు కలిసి 12 గంటల పని విధానం కోసం ప్రయత్నాన్ని తక్షణ విరమించుకోవాలని వాటికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,ఉద్యోగ భద్రత, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవులలో కేవలం ఏడు కోట్ల మందికి మాత్రమే ఉద్యోగ సాంఘిక భద్రత తగిన వేతనాలతో జీవిస్తున్నారు మిగతా 40 కోట్ల శ్రమజీవులు అందరికీ సరిపడా వేతనాలు లేక బతుకు భద్రత లేక కొట్టుమిట్టాడుతున్నారు రాజ్యాంగం కోర్టుల గురించి గొప్పలు వల్లించే పాలకులారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం తీర్పును రాజ్యాంగం ప్రకారము ఎందుకు అమలు చేయడం లేదో పాలకులు సమాధానం చెప్పాలన్నారు కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా ఆమోదించి అమలు చేయడం వలన కార్మికులను కట్టు బానిసలుగా మారబోతున్నారు ట్రేడ్ యూనియన్ హక్కులైనా సమ్మె , వేతనాల గురించి చర్చలు లేకుండా చేయడం. అధిక పనిగంటలు, నియమిత కాల పరిమితి గల ఎంప్లాయిమెంట్ ఉండే విధంగా నిబంధనలు, పరిశ్రమల మూసివేత& కార్మికుల తొలగింపులకు సులభతర అవకాశాలను కోర్సులో పొందుపరిచారు.అమెరికా దేశం చికాగో నగరంలో 139 సంవత్సరాలు కింద ఏర్పడ్డ ఎర్రని జెండా నీడలో కార్మికులు, చిన్న ఉద్యోగులు, రైతాంగం కలిసి విముక్తికై పోరాడుతూ దేశాలను విముక్తి చేసుకోవాలని ఆ విముక్తి పోరాటాలలో కార్మికులు కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యు సి ఐ జిల్లా నాయకులు కె. రాజేశ్వర్ జిలకర నడిపన్న లక్ష్మణ్ శ్రవణ్ నాగరాజ్ అరవింద్ డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్ టి యు సి ఐ సత్తెవ్వ నరేష్ సత్యనారాయణ గంగాధర్ ఫయాజ్ అశోక్ తుకారాం తదితరులు పాల్గొన్నారు
