Tuesday, April 29, 2025
Homeఆంధ్రప్రదేశ్పరిశుభ్రతే పరిరక్షణప్రజల ఆరోగ్యమే మాకు కావాల్సింది.

పరిశుభ్రతే పరిరక్షణప్రజల ఆరోగ్యమే మాకు కావాల్సింది.

Listen to this article

మురుమూరు పంచాయతీ కార్యదర్శి గడ్డం కార్తీక్.

పయనించే సూర్యుడు; ఏప్రిల్ 24: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని మొరూమూరు పంచాయితీకి చెందిన ఘనపురం కాలనీ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ ని మురుమూరు పంచాయతీ సంబంధించిన కార్యదర్శి గడ్డం కార్తీక్ తన సిబ్బందితో వాటర్ ట్యాంక్ ని పరిశుభ్రంగా చేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ప్రజలకి అన్ని విధాలుగా ఆరోగ్య విషయంలో కానీ మరే విషయంలో అయినా సరే అన్ని విధులు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రభుత్వ నుండి వచ్చే నిధులను ప్రజల విషయంపై ఖర్చు చేస్తామని ప్రజల ఆరోగ్య విషయంలో పూర్తి దృష్టి కేటాయిస్తామని తెలియజేశారు ఈ యొక్క వాటర్ ట్యాంకు పరిశుభ్రత కార్యక్రమంలో మురుమూరు పంచాయతీ కార్యదర్శి గడ్డం కార్తీక్ మరియు పంచాయితీ సిబ్బంది బొగ్గం బాబు, పాయం శాంతమూర్తి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments