
పయనించే సూర్యుడు జనవరి 11 హసన్ పర్త మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
వరంగల్ నగర పరిధిలోని హసన్ పర్తి 66వ డివిజన్ లోని సుజాత విద్యా నికేతన్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు గత 30 సంవత్సరములుగా కృషి చేస్తున్న సుజాత విద్యా నికేతన్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ పర్యావరణ సంరక్షణ గతి విధి ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ, అనే సంస్థ వారు పర్యావరణ అవగాహనపై సోషల్ ఇంటర్ను షిప్ ప్రోగ్రాం తేదీ 26 అక్టోబర్ 2024 నుండి 28 డిసెంబర్ 2024 వరకు 9 వారాల పాటు జాతీయస్థాయిలో ఆన్లైన్లో నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో 66 డివిజన్ కేంద్రం సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతరాం కర్ణ పాల్గొన్నారు సుమారు 500 మంది పాల్గొన్న ఈ జాతీయ స్థాయి పర్యావరణ అవగాహన కార్యక్రమంలో శాంతరాం కర్ణకి పర్యావరణ అవార్డు రావడం జరిగింది.ఇటీ అవార్డును హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా తేదీ 9- 1 -2025 రోజున కలెక్టర్ ఛాంబర్ లో అందుకోవడం జరిగినది ఈ సందర్భంగా కలెక్టర్ ఆకుతోట శాంతరాం కర్ణని అభినందిస్తూ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక వాతావరణ సమస్యలకు పరిష్కారం పర్యావరణాన్ని కాపాడుకోవడమేనని అందుకు మీరు చేస్తున్న కృషికి ఈ అవార్డు దర్పణం అని పేర్కొన్నారు ఆకుతోటి శాంతరాం కర్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటడం సంరక్షించడం మట్టి వినాయక విగ్రహాల తయారీ ఇతర కార్యక్రమాల ద్వారా చేస్తున్న కృషికి వ్యక్తిగతంగా సుమారు 50 అవార్డులు వచ్చినవని ఈ అవార్డు మరింత స్ఫూర్తిదాయకంగా పర్యావరణ కార్యక్రమాలను నిర్వహణకు తోడ్పడుతుందని మా సుజాత విద్యా నికేతన్ పాఠశాల పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందుకు గాను పాఠశాలకు సుమారు 60 వేల అవార్డులు/ బహుమతులు రావడం జరిగినదని ఇద్దరు రాష్ట్రపతులు ఇద్దరు గవర్నర్లు ఐదుగురు కేంద్ర మంత్రులు ఒక్క ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు అధికారులు స్వచ్ఛంద సంస్థల నుండి అవార్డులు స్వీకరించినామని తెలిపినారు ఇకముందు కూడా పర్యావరణ పరిరక్షణకు మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ కృషి చేస్తామని తెలిపినారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆకుతోట శాంతారామ్ కర్ణని సత్కరించడం జరిగినది.