పయనించే సూర్యుడు జనవరి 11 ( మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రతినిధి రఘుపతి ): పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ లో విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి సంబరాలు ఆటల పాటలతో మరియు గాలిపటాలతో సంక్రాంతి ముగ్గులతో భోగి మంటలు లోడి ఆడుతూ ఆనందోత్సవాలతో మునిగితేలారు. వైస్ ప్రిన్సిపాల్ సూజాన్. హెచ్ఎం షిరీన్. రీనా సాజన్.తెలుగు విభాగం ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ విద్యాధరి రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది పల్లెటూర్లు. ఈ పండుగ వేళ పల్లెటూర్లన్నీ కళకళలాడుతాయి అమ్మమ్మ ఊళ్లో బంధువులందరి మధ్య కలిసి చేసుకునే పండుగ. ఈ పండుగ ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లలో భోగిమంటలు కలర్ఫుల్ ముగ్గులు వాటి మధ్యన గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు.కుర్ర కారు కేరింతలు పల్లెటూరి ఆడ పడుచుల అందాలు. కోళ్ల పందాలు. ఎడ్ల పందాలు అంతేకాదు కొత్త కోడళ్ళు కొత్త అల్లుళ్లలో ఇలా సరదాగా జరుపుకునే పండుగ. అదేవిధంగా రైతులందరికీ ఈ సమయంలో పంట చేతికొస్తుంది. ఈ పండుగ రోజు పాడి పశువులను పూజించి తమ దైవ సమానులైన తల్లిదండ్రులను ప్రార్థించి బంధుమిత్రులతో కలిసి చేసుకునే పండుగ ఈ సంక్రాంతి. సంక్రాంత్రి పండుగ అర్థం” సం’ అంటే మంచి అని” క్రాంతి’ అంటే అభ్యుదయం అని Asked అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పల్లవిమోడల్ స్కూల్ అల్వాల్లో ముందుగానే జరుపుకున్న సంక్రాంతి సంబరాలు
RELATED ARTICLES