
జనం న్యూస్ ఫిబ్రవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం పోట్రూ సందర్శించారు. సోమవారం పాఠశాలలో ని ఏ వన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ల్యాబ్ ను జిల్లా విద్యాధికారి విజయ కుమారితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు సిలబస్ వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులకు చదువు గొప్పతనం వివరించి వారిలో ఆత్మస్థైర్యం నింపారు.కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధా పద్మజ పిఎస్ హెడ్మాస్టర్ అనుసూయ ఏ ఎం ఓ రవీందర్ రాజు ఏఏపిసి స్కూల్ చైర్మన్ దుర్గాభవాని ఉపాధ్యాయులు మోహన్ రావు సీతాలక్ష్మి సిద్దయ్య విటల్ గౌడ్ శ్రీనివాస్కిరణ్మయి విజయలక్ష్మి సుధారాణి గోవిందు గొడుగు శ్రీనివాస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.