
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 20
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్, ఎటపాక మండలం,కృష్ణవరం గ్రామ పబచాయితీ పరిధిలోని చింతలచెరువు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉన్న రహదారి చిన్న వర్షం కురిస్తే చాలు వాహనాల రాకపోకలకే కాదు నడవడానికి కూడా వీలుకానంత బురదమయమై తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో శాశ్వత పరిస్కారం కోరుతూ సి సి రోడ్ వేయించండి అంటూ ఎన్నోసార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో, అధికారులతో మొరపెట్టుకున్న పరిష్కారం కాకపోవడంతో విసుగుచెంది బురద గుంతలా మారిన రోడ్డుపై గ్రామస్తులందరూ కలిసి వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసనకు దిగారు.
ఈ కార్యక్రమంలో కాకా ప్రసాద్, కాకా సత్తమ్మ, కారం సుజాత, కారం కన్నయ్య, కుంజా రాము తదితరులు పల్గిన్నారు.