
పయనించే సూర్యుడు అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి జులై12
మండల పరిధిలోని బైరా గుట్ట దగ్గర ఎం సీ ర్ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం10 గం”కు బడుగుబలహీన మైనార్టీ వర్గాల ఆశాదీపం మాజీ ఎమ్మెల్యే,ఎంపీ,కీర్తిశేషులు స్వర్గీయ సుగవాసి పాలకొండ్రాయుడు సంస్మరణ సభను సుండుపల్లి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామ లకు చెందిన ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా హాజరుకావాలని పెద్దాయన సుగవాసి సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు సుగవాసి అభిమానులు కోరుచున్నాము.